ప్రస్తుతం ఓటీటీ హావా నడుస్తోంది. తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లో ఆహా ఒకటి. 2020లో అర్హా మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (అల్లు అరవింద్ నేతృత్వంలోని) మై హోమ్ గ్రూప్‌ల మధ్య ఉమ్మడి యాజమాన్యంలోని వెంచర్ ఆహా. తెలుగు సక్సెస్ తర్వాత 2022లో ఆహా తమిళ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం డిజిట్ ప్లాట్‌ఫారమ్‌లు ఆర్థికంగా కఠినమైన సమయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
పెద్ద సంఖ్యలో వీక్షకులు ఉన్నప్పటికీ, కంటెంట్ అధిక ధరల కారణంగా OTT ప్లాట్‌ఫారమ్‌లు పెద్దగా లాభాలను ఆర్జించలేకపోతున్నాయి. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొన్ని ఇతర షోలు ప్రచారం అవుతున్నాయి. ఆహా టీమ్ భారీ వ్యూయర్‌షిప్‌ని పొందడానికి చాలా పెట్టుబడి పెట్టింది. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో, అనేక ఇతర షోలను సొంత ప్రొడక్షన్స్‌లో రూపొందించింది.
కానీ ఇప్పుడు, అధిక రిస్క్ ఫ్యాక్టర్ కారణంగా టీమ్ OTT ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహించడంలో ఆసక్తిని కనబరబలేకపోతున్నట్లు తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ , జీ5 వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతర మీడియం-బడ్జెట్ చిత్రాలు, భారీ-బడ్జెట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. ఆహా కేవలం చిన్న చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తుంది.
ఇది కాకుండా ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే Aha సబ్‌స్క్రిప్షన్ ధర చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా రిస్క్ తీసుకోలేక, లాభాలు ఆర్జించలేకపోతున్నారని సమాచారం. ఈ పరిమితుల కారణంగా, టీమ్ ఇప్పుడు ప్స్తుంది్‌ను విక్రయించాలనే ఆలోచిస్తున్నరట. సోనీ నెట్‌వర్క్, సన్ నెట్‌వర్క్ , కొంతమంది దిగ్గజ విక్రేతలతో చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరి ఆహాని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.