సినిమాలు తొందరగా చిత్రీకరించి, రిలీజ్ చేస్తుంటాడు దర్శకుడు పూరీజగన్నాథ్. ప్రస్తుతం
కల్యాణ్ రామ్ తో ‘ఇజం’ చిత్రాన్ని రూపొందిస్తోన్న పూరీ తన తదుపరి సినిమా మహేష్ లేదా
ఎన్టీఆర్ లతో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలు పట్టా లెక్కడానికి కాస్త సమయం
పడుతుంది. అందుకే ఈలోగా ఓ చిన్న సినిమా చేయాలనేది ఆయన ప్లాన్. తన స్నేహితులతో
కలిసి పూరీ ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వ బాధ్యతలు
వహిస్తారో.. లేదో అనే విషయం తెలియాల్సివుంది. ఈ సినిమాలో హీరోగా నాగశౌర్యను తీసుకోవాలని
పూరీ భావిస్తున్నాడు. ప్రస్తుతం శౌర్య సుకుమార్ నిర్మాణంలో ఒక సినిమా, అలానే సాయి
కొర్రపాటి నిర్మాణంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల కంటే ముందుగానే
పూరీ సినిమా చేయాలని సిద్ధపడుతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు
త్వరలోనే వెల్లడించనున్నారు.