HomeTelugu Big StoriesPoonam Pandey : జనాలు పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా.. పూనమ్‌ పాండేపై నెటిజన్లు ఫైర్‌

Poonam Pandey : జనాలు పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా.. పూనమ్‌ పాండేపై నెటిజన్లు ఫైర్‌

poonam pandey not died

Poonam Pandey : బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందిన్నట్లు వచ్చిన వార్త అందరినీ షాక్‌ కు గురి చేసిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి సోషల్ మీడియా లో ఆమె గురించే చర్చ జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. దీంతో కొందరూ RIP పోస్టులు పెడుతూ సంతాపం తెలిపారు. ఎంతో ఫిట్‌గా చలాకీగా ఉండే పూనమ్ పాండే ఆకస్మికంగా చనిపోవడం ఏంటీ అంటూ పలువురు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఆరా తీశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయిండొచ్చు అని కామెంట్స్ సైతం చేశారు.

తాజాగా పూనమ్ పాండే నుంచి ఒక షాకింగ్‌ మెసేజ్‌ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ పోస్ట్‌ పెట్టింది పూనమ్. తనకు ఎలాంటి క్యాన్సర్‌ లేదని పేర్కొంది. సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌) గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని వీడియో రిలీజ్ చేసింది.

“మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళలు చనిపోయారు” “కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. HPV వ్యాక్సిన్‌ ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కోవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు వైద్యశాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం” అని పూనమ్‌ పాండే తెలిపింది.

అయితే పూనమ్ మృతి పై మొదటి నుంచి అందరిలో అనుమానాలు ఉన్నాయి. ఆమె నిజంగానే చనిపోయిందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీలు మరణిస్తే వారి ఇంటికి నటులు, బంధుమిత్రులు వస్తారు. మీడియా అంతా అక్కడే ఉంటుంది. కానీ పూనమ్‌ పాండే ఇంటి దగ్గర అలాంటిదేమీ కనపడలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఎక్కడా మాట్లాడలేదు. దేశమంతా హట్‌ టాపిక్‌గా మారిన ఈ విషయంపై ఆమె కుటుంబ సభ్యులు మౌనం పాటిస్తూనే వచ్చారు. దీంతో పూనమ్ పాండే మృతి వార్త కేవలం పబ్లిసిటీ స్టంటేనా అన్న అనుమానాలు కలిగాయి.

తాజాగా ఆమె బతికి ఉందని వీడియో విడుదల కావడంతో.. నెటిజన్లు ఓ రెంజ్‌లో మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ విమర్శిస్తున్నారు. వరస్ట్ పబ్లిసిటీ ఫర్ ఎవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అవగాహన కల్పించే పద్దతి ఇదా అంటూ ఫైర్ అవుతున్నారు. జనాలు పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..? ఇలాంటి ప్రచారం సరికాదంటూ విమర్శిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Recent Articles English

Gallery

Recent Articles Telugu