బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడు తాజాగా పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబెతో ఈ భామకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను సామ్ షేర్ చేసింది. ‘చివరకు మేము.. పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్ చేసిన పూనమ్.. బెస్ట్ ఫీలింగ్ అని అన్నారు.
కాగా, సామ్, పూనమ్‌లు గత కొద్దికాలంగా డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే పూనమ్ కూడా తనదైన వ్యాఖ్యలతో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మే నెలలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తన సోయగాలతో ఫాలోవర్స్ కు పిచ్చెక్కేలా చేస్తున్న పూనం పాండే, తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఎప్పడూ హాట్ హాట్ స్టిల్స్ అండ్ వీడియోస్ తో తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. నిత్యం వివాదాస్పద ట్వీట్లతో రెచ్చిపోయే ఈ భామ అటు సినిమాల్లో సైతం రాణిస్తోంది పూనమ్.