లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించి బాలీవుడ్ హాట్ భామ పూనమ్ పాండే అరెస్ట అయిందనే వార్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి. డైరెక్టర్ సామ్ అహ్మద్ బాంబేతో కలిసి కారులో చక్కర్లు కొడుతూ ముంబై పోలీసులకు పూనమ్ చిక్కిందని, వారిద్దరినీ అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పూనమ్ పాండే ఖండించింది. లాక్‌డౌన్ సమయంలో తాను ఇల్లు దాటి అసలు బయటకు వెళ్లలేదని, అరెస్టు వార్తలు విని షాకయ్యానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పూనమ్ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. నిన్న రాత్రంతా తాను సినిమాలు చూస్తూ గడిపినట్లు, నాన్‌స్టాప్‌గా మూడు సినిమాలు చూసినట్లు తెలిపింది. అలాంటి సమయంలో తన అరెస్టు వార్తల గురించి తనకే కొందరు ఫోన్లు చేశారని వాపోయింది. దాంతో షాక్ అయ్యానని, దయచేసి అలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దు.. ఇంట్లోనే సంతోషంగా ఉన్నానంటోంది. పూనమ్.