మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పినందుకు మీరా చోప్రాపై అభిమానులు విరుచుకు పడ్డారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు మాత్రం కావాలనే ఆమెతో అసభ్యకరమైన పదజాలం వాడారు. దాంతో మీరా చోప్రా ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకుంది. దానితో ఈ ఇష్యూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా వెళ్లింది. కల్వకుంట్ల కవితకు ఫిర్యాదు చేసింది మీరా.
ఏపీ ప్రభుత్వాన్ని కూడా కలగజేసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ వివాదంపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. ఫ్యాన్స్ తప్పేం లేదంటుంది. ఈ వివాదంలో అనవసరంగా ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయొద్దని.. వాళ్లు అమాయకులని.. వాళ్లను కావాలనే కొందరు స్వలాభం కోసం వాడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎటువంటి కారణం లేకుండా తన పేరు ఈ వివాదంలోకి లాగినా కూడా తను అభిమానులపై కోపంగా లేనని.. వాళ్లపై ఫిర్యాదు కూడా చేయలేదని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. గతంలో తనను బాధపెట్టిన వ్యక్తులపై మాత్రమే ఫిర్యాదు చేశాను కానీ అందరిపై కాదని గుర్తు చేసింది పూనమ్. ఏదేమైనా కూడా ఫ్యాన్స్ అమాయకులంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.
No actor wants his fans to abuse any one , it’s created by jealous factors in and around the industry n media . They don’t have time for this . Trolling is a part of actors life . Criminal acts needs to be reported . Trolling is a game done to victimse u .dont bother .move on!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020
We don’t even know if these fans are fake accounts created by political gains and at the end the actor gets blamed no matter who it is …. accept that our industry is interlinked with one political party each .fans are innocent people ,few political people are evil .they do this
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020