HomeTelugu Trendingపెళ్లి వార్తలపై పూనమ్‌ కౌంటర్‌

పెళ్లి వార్తలపై పూనమ్‌ కౌంటర్‌

Poonam kaur reacted pon her
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అందరికీ కర్వాచౌత్ శుభాకాంక్షలు చెబుతూ గురువారం రాత్రి పూనమ్ ఓ ఫోటో పంచుకుంది. ఇందులో పూనమ్ కౌర్ జల్లెడ చేతబట్టి.. నవ్వుతూ కనిపించింది. అయితే ఈ ఫోటో చూడగానే నెటిజన్లకు పలు సందేహాలు వచ్చాయి. పూనమ్ కు పెళ్లైందా? లేదా పెళ్లి కుదిరిందా? చంద్రబింబాన్ని చూసిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని చూశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కర్వాచౌత్ అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ. భర్త దీర్ఘాయుష్షుతో ఉండాలని పెళ్లైన మహిళలు పార్వతీదేవికి ఈ పండుగ రోజున పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి.. భక్తి శ్రద్దలతో అమ్మవారిని వేడుకుంటారు. రాత్రి సమయంలో జల్లెడ నుంచి చంద్రుడిను చూసి.. ఆపై భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు.

అయితే పూనమ్ కౌర్ కూడా ఈ పండుగను జరుపుకున్నట్లు ఫోటో షేర్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వార్తలపై పూనమ్‌ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది. ”ఈరోజు చుట్టూ తిరుగుతున్న కథనాలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయా లేక మిషనరీల ఆలోచనా విధానంతో ప్రేరేపించబడ్డాయో నాకు తెలియదు. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి – ఓం నమః శివాయ.. వాసుదేవ కుటుంబం మీరు నేర్చుకోవలసినది” అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా కర్వాచౌత్ పండుగను ఎవరెవరు జరుపుకుంటారో తెలియజెప్పాడనికి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని స్క్రీన్ షాట్స్ ని పూనమ్ కౌర్ షేర్ చేసింది. వీటి ద్వారా పెళ్లైన మహిళలే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ కాబోయే భర్తల కోసం ఈ వేడుకలను జరుపుకుంటారని తెలియజెప్పింది. పెళ్లి కుదిరినవారు ప్రేమలో ఉన్నవారు సైతం తమకు కాబోయే భాగస్వామి కోసం కలిసి కర్వాచౌత్ సందర్భంగా పూజలు చేస్తారు. కాకపోతే పెళ్ళైన మహిళలు చంద్రుడిని చూస్తే.. పెళ్లికాని అమ్మాయిలు మాత్రం చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారని పూనమ్ కౌర్ వివరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu