సంచలన నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె ట్విటర్లో చేసిన ఓ ఫొటో వైరల్ అవుతుంది. నిన్న రాత్రి ఆమె ఈ ఫొటోను షేర్ చేసింది. ఇందులో పూనమ్ జల్లెడ పట్టుకుని చంద్రుడిని చూస్తూ నవ్వులు చిందిస్తుంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ” మేడం ఈ పండుగ పెళ్లి అయిన మహిళలు మాత్రమే చేసుకుంటారు. మరి మీరెందుకు చేస్తున్నారు”, “మీకు పెళ్లి కుదిరిందా?”, “చంద్రుడుని చూసిన తరువాత ఎవరి ముఖం చూస్తారు: అంటు ట్వీట్ చేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వాచౌత్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. భర్త దీర్ఘాయుష్షును కోరుతూ..పెళ్లైన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. ఆ తరువాత జల్లెడలో చంద్రుడి చూసి.. ఆతరువాత భర్త మొఖం చూసి ఆశ్వీరాదం తీసుకుంటారు. పెళ్లికాని యువతులు కాబోయేవారితో ఈ పూజాలు నిర్వహిస్తారు.
https://www.instagram.com/p/CjqQheAvfmQ/?utm_source=ig_web_copy_link