HomeTelugu Trendingఆ సన్నాసి వల్ల జీవితం పాడైంది.. పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

ఆ సన్నాసి వల్ల జీవితం పాడైంది.. పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

8 18

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది సెలబ్రిటీస్ కూడా తమ జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు అయితే ఏకంగా తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని.. కానీ ధైర్యంతో నిలబడి పోరాడి గెలిచామని వెల్లడించారు. ఇదే విషయంపై కొన్ని రోజుల క్రితం హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

తన జీవితంలో కూడా ఓ ప్రముఖ దర్శకుడి కారణంగా చాలా డిప్రెషన్‌కు లోనయ్యానని.. ఆయన తన జీవితం నాశనం చేసాడని చెప్పుకొచ్చింది. తన స్నేహితుడి జీవితాన్ని కూడా నాశనం చేసాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతా ఆయన్ని గురూజీ అంటారు కానీ ఆయన గురూజి కాడని ట్వీట్ చేసింది పూనమ్. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అందులో భాగంగా ఓ నెటిజన్ మీరు లీగల్‌గా ఎందుకు పోరాడలేదని సలహా ఇచ్చాడు. దీంతో పూనమ్ ఘాటుగా రియాక్ట్ అయింది. ”మీ అన్న చెప్పారా? ఆయన ఓడిపోతే హ్యాపీగా ఉందా? ఆయన ఇన్సల్ట్ అయింది మీకు హ్యాపీగా ఉందా..? చెప్పండి. మూడు పెళ్లిళ్లు అని అవమానిస్తుంటే హ్యాపీగా ఉందా? ఆ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైందని తెలియాలి.. నమస్తే” అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు పూనమ్ చేసిన ఈ ట్వీట్లు ఎంత పెద్ద దుమారం రేపుతాయో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu