HomeTelugu Trendingనిర్భయ తల్లితో పూనమ్‌కౌర్

నిర్భయ తల్లితో పూనమ్‌కౌర్

12 4
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సినీ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై తనదైన శైలిలో గళం వినిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆడవాళ్లపై జరుగుతున్న అక్రమాలపై ట్వీట్‌ల రూపంలో తన వాణి వినిపిస్తారు. ఇప్పుడు ఆమె ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఆమెకు ఓ రెస్టారెంట్ లో చిన్న విందు కూడా ఇచ్చారు. అంతేగాక ఆశాదేవి భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసిన ఓ ఫొటోను పూనమ్ కౌర్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది. ఆ రోజున యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా కాలం పాటు ఎదురుచూశాం. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి మన దేశం ఎంతో సంతోషిస్తోంది అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu