నటి పూనమ్ కౌర్ వివాదస్పద దర్శకుడ రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది. ట్విట్టర్ లో ఆర్జీవీ తన తదుపరి సినిమా “పవర్ స్టార్” అని టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ తో పాటు ఆయన పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేసి “ఇతడే నా పవర్ స్టార్” అని పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఈ సినిమాలో “పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్” పాత్రలు కూడా ఉంటాయని వెల్లడించాడు. కాగా ఆ ట్వీట్‌ను హీరోయిన్ పూనమ్ కౌర్ షేర్ చేసి “అందులో ఆర్జీవీ అనే పాత్రను కూడా చేర్చండి. ఆయన అమ్మాయిల మానసిక బలహీనతను కనుగొంటారు. అసభ్యమైన భాషను ఉపయోగించమని ప్రేరేపిస్తారు. వారు చేస్తున్నట్టుగా ట్వీట్లను పంపి షేర్ చేయమంటారు. మిమ్మల్ని నా చిన్నపుడు గౌరవించేదాన్ని.. అందుకు ఇప్పుడు బాధపడుతున్నా” అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అనంతరం పూనమ్ మరో ట్వీట్ చేసింది. ” నేను ఆ డైరెక్టర్ చేసిన ఫోన్ కాల్స్ రికార్డు చేసి ఉంటే బాగుండేది. అతడు నాకు ఫోన్ చేసి ఓ వ్యక్తిగురించి మాట్లాడాలని గంటలతరబడి బ్రెయిన్ వాష్ చేసేవాడు. నాకు ట్వీట్లు పంపి షేర్ చేయమనేవాడు. ఆ ట్వీట్లను సంబంధిత పార్టీ వ్యక్తికి పంపించాను. థాంక్ గాడ్ మీడియాలో కొందరైనా నిజాయితీగా ఉన్నారు” అంటూ ట్వీట్ చేసింది.