టాలీవుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌రేట్(ఈడీ) పలువురు సినీ తారలను ప్రశ్నిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి ఛార్మిలను ఈడీ ఇప్పటికే విచారించింది. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ ట్విటర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని అన్నారు.
‘‘డ్రగ్స్ కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది ప్రతీ ఒక్కరిది. ఇది ఒక సరిహద్దు సమస్యలాంటిది. రాజకీయ అజెండాకు సంబంధించింది. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు సమానమైంది. ఈ విషయంపై నేను మాట్లాడాలనుకుంటున్నా. త్వరలోనే నా అనుభవాలను పంచుకుంటా’’ అని పూనమ్ ట్వీట్ చేశారు.
నేడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ విచారిస్తోంది. రాబోయే రోజుల్లో రానా దగ్గుబాటి – రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ – నవ్ దీప్ – ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ – ముమైత్ ఖాన్ – తనీష్ – నందు – తరుణ్ లను ఈడీ విచారించనుంది. ఈ మేరకు ఏ తేదీల్లో హాజరు కావాలి ఏయే డాక్యుమెంట్స్ తీసుకురావాలి వంటి విషయాలను ఈడీ నోటీసుల ద్వారా వారికి తెలిపింది.