టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మీడియా కంట పడ్డ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తకుండా మాత్రం వదలరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్.. తాజాగా తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ బ్యూటీకు మరోసారి పవన్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ తో నటించారు కదా.. ఆయన గురించి చెప్పండి అని విలేఖరి అడగగా.. పూనమ్.. నేను చేయలేదు.. చేయనివ్వలేదు చాలామంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆయన గురించి ఏమి చెప్పినా వివాదమే అవుతుంది. పాజిటివ్ గా చెప్పినా నెగిటివ్ గానే అర్ధం చేసుకుంటారు. అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది! దేవుడా! అంటూ పూనమ్ నవ్వినా తీరు అందరిని ఆకట్టుకుంటుంది. కానీ పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడా అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.