విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోయిన్ గౌతమి నుంచి విడిపోయిన తర్వాత నటి పూజా కుమార్‌తో సహజీవనం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం హీరోయిన్ పూజా కుమార్ తో రిలేషన్‌షిప్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ కుటుంబలోని వేడుకలకు హాజరు అవుతుండడం.. వారి ఫ్యామీలీలోని సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలు వస్తున్నాయి. అంతేగాక.. ఇటీవల కమల్ బర్త్ డే ఏర్పాట్లన్నీ తనే స్వయంగా చేస్తున్నట్లు కనిపించింది.
వీరిద్దరి మధ్య నడుస్తున్న పుకార్ల పై పూజా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. “నేను గత ఐదారేళ్లుగా కమల్ సార్ తో కలిసి పని చేస్తున్నాను. ఆయన ఓ గొప్ప క్రియేటర్ అండ్ ఓ మెస్మరైజర్. నాకు కమల్ తో పాటు వారి ఫ్యామిలీ మెంబెర్స్.. బ్రదర్స్.. కూతుర్లు అందరూ బాగా పరిచయం. అందుకే వారి ఫ్యామీలీని ఫంక్షన్‌లకు నేను కూడా హాజరవుతుంటా అని పూజా కుమార్ చెప్పుకొచ్చింది. అంతకు మించి తమ మధ్య మరేదీ లేదని ఆమె స్పష్టం చేసింది. నేనేదో కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయనున్నట్లు అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు”అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ