HomeTelugu Trendingటాలీవుడ్‌ నాకు ప్రాణ సమానం: పూజా హెగ్డే

టాలీవుడ్‌ నాకు ప్రాణ సమానం: పూజా హెగ్డే

Pooja Hegdes response on c
పూజా హెగ్డే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్‌ గురించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. ఇక్క‌డి వాళ్ల‌కు న‌డుమంటే వ్యామోహం అని, హీరోయిన్ల‌ను మిడ్ డ్ర‌స్‌ల‌లో చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్పుకొచ్చింది. ఈ క్లిప్పింగ్ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో మీకు అన్నం పెట్టిన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కించ‌ప‌ర్చ‌డానికి సిగ్గనిపించ‌ట్లేదా? అంటూ నెటిజ‌న్లు ఓ స్థాయిలో మండిపడ్డారు. టాలీవుడ్‌ను వ‌దిలి వెళ్లిపొమంటూ.. కామెంట్స్‌ చేశారు.

వీటిపై పూజా హెగ్డే స్పందించింది. తాను ఇంట‌ర్వ్యూలో అన్న మాట‌ల‌ను వేరే సంద‌ర్భానికి అన్వ‌యిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అక్ష‌రాన్ని మార్చ‌గ‌ల‌రేమో కానీ అభిమానాన్ని కాద‌ని చెప్పుకొచ్చింది. త‌న‌కు తెలుగు చల‌న‌చిత్ర పరిశ్ర‌మ ఎప్ప‌టికీ ప్రాణ స‌మానమ‌ని స్ప‌ష్టం చేసింది. ఇది త‌న చిత్రాల‌ను అభిమానించే వారికీ, త‌న అభిమానుల‌కు తెలిసినా.. ఎటువంటి అపార్థాల‌కు తావివ్వ‌కూడ‌ద‌నే మ‌ళ్లీ చెబుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. త‌న‌కు ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టిన తెలుగు ఇండ‌స్ట్రీకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను అని ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది. ఇంట‌ర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థ‌మ‌వుతుంద‌ని స‌ల‌హా ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu