టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజా హెగ్డే. సుమారు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్‌గా మారింది. ఇటీవల ‘అరబిక్ కుతు’ సాంగ్‌లో విజయ్‌తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేల్ రాణి’గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్ 15) న ప్రారంభించారు.
అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్‌లో ఈ పార్టీ నెంబర్‌ను షూట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. పూజా హెగ్డే చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ ఒక్క పాట కోసం పూజా హెగ్డే సుమారు రూ. 1.25 కోట్లు డిమాండ్ చేయగా కోటి రూపాయలకు నిర్మాతలు ఒప్పించినట్లు సమాచారం. ఒకే స్క్రీన్‌పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీరన్ పిర్జాదా, సోనాల్ చౌహన్ కనిపించడం నిజంగా ఫన్‌గానే ఉండనుంది. ఈ పాటను రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ‘ఎఫ్ 3’ చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.