HomeTelugu Big Storiesటాలీవుడ్‌పై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్స్‌ ఫైర్‌

టాలీవుడ్‌పై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్స్‌ ఫైర్‌

Pooja Hegde sensational com
టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ల్లో పూజా హెగ్డే ఒకరు. తాజాగా ఆమె తెలుగు చిత్రపరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారని, మిడ్‌ డ్రెస్‌లలోనే హీరోయిన్లను చూడాలనుకుంటారని ఓ ఇంటర్వ్యూలో పూజ పేర్కొన్నారు. హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్‌ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతుంది. సౌత్ సినిమా వాళ్లకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని, వాళ్లను ఎప్పుడూ మిడ్ డ్రెస్‌ల్లోనే చూడాలనుకుంటారంటూ వ్యాఖ్యానించింది. దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని నెటిజన్లు మండి పడుతున్నారు. దక్షిణాదిని కించపరిచే బదులు ఎక్స్‌ఫోజింగ్‌ పాత్రలు చేయకుండా ఉండాలని పూజాకు సలహాలు ఇస్తున్నారు. తెలుగు ఆడియన్స్‌ స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇచ్చినందుకు వాళ్లకు పూజ తగిన గుణపాఠం చెప్పారని.. అక్కడితో ఆగకుండా ఇక తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోమ్మని పలు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై పూజా హెగ్డే ఎలా స్పందిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu