HomeTelugu Newsబన్నీ-త్రివిక్రమ్‌ సినిమాలో.. హీరోయిన్‌ ఈమేనా?

బన్నీ-త్రివిక్రమ్‌ సినిమాలో.. హీరోయిన్‌ ఈమేనా?

0స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తర్వాతి మూవీలో హీరోయిన్‌ ఈమేనంటూ ఇప్పటికే పలువురు నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. కియారా అడ్వానీ నటించే అవకాశాలు ఉన్నాయని ఇటీవల చెప్పుకొచ్చారు. కాగా తాజాగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన నటించి మెప్పించిన ఆమె మరోసారి ఆయనతో కలిసి నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

పూజా హెగ్డే ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. మహేశ్‌బాబు ‘మహర్షి’, టైటిల్‌ ఖరారు చేయని ప్రభాస్‌-‘రాధాకృష్ణ’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్‌లో ఆమె ప్రధాన పాత్రలో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది కూడా పూజా హెగ్డే చాలా బిజీగా గడిపారు.

బన్నీ 19వ సినిమాగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్‌ల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu