‘అల వైకుంఠపురములో’ సినిమాతో పూజ హెగ్డేకు మరింత రేంజ్ పెరిగిపోయింది. పారితోషికం ఎక్కువైన సరే ఆమె కావలంటూ.. దర్శక నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ‘రాధే శ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో రామ్ చరణ్ సరసన కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ కూడా ఓ పూర్తి నిడివి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా పలువురు హీరోయిన్‌ల పేర్లను పరిశీలించిన మీదట ప్రస్తుతం పూజ హెగ్డే తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇందులో నటించడానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఇదిలావుంచితే, పూజ హెగ్డే ఇటు తెలుగులో నటిస్తూనే.. అటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అక్కడ ‘కభీ ఈద్ కభీ దివాలి’, ‘సర్కస్’ చిత్రాలలో నటిస్తోంది. మరికొన్ని ప్రాజక్టులు కూడా ప్రస్తుతం చర్చల దశలో వున్నాయి.