![Pooja Hegde మొత్తానికి పగ తీర్చుకుంది! ఎవరి మీదో తెలుసా? 1 Pooja Hegde finally gets her revenge](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/10/New-Project-2024-10-27T193407.-1.jpg)
Pooja Hegde Upcoming Movies:
ఒకప్పటి స్టార్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్‌లో మరో ముఖ్యమైన అవకాశాన్ని అందుకుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న కామెడీ చిత్రంలో, ఆమె రెండవ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొదట ఈ పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయగా, పూజా హెగ్డే ఆమె స్థానాన్ని దక్కించుకున్నారు.
పూజా హెగ్డే, వరుణ్ ధావన్‌తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. పూజా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ, త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సినిమాకి “హై జవాని తో ఇష్క్ హోనా హై” అనే టైటిల్‌తో ప్రచారంలో ఉంది, కానీ ఇంకా అధికారికంగా టైటిల్ ఖరారు కాలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత ఏడాది మహేష్ బాబు నటించిన “గుంటూరు కారంలో” పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. ఇప్పుడు, అదే విధంగా శ్రీలీల స్థానంలో పూజా హెగ్డే ఈ బాలీవుడ్ చిత్రంలో అవకాశం దక్కించుకోవడం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.
గుంటూరు కారం చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడం ఈ మార్పులో ఒక కారణమై ఉండవచ్చు. పూజా హెగ్డే ఈ చిత్రం ద్వారా హిట్ సాధిస్తారా లేదా అనేది అందరికీ ఉత్కంఠగా మారింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ల పాత్రలు ప్రేక్షకులకి గ్లామర్ ట్రీట్ ఇస్తాయని చెప్పుకోవచ్చు.
డేవిడ్ ధావన్ సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ ప్రదర్శనకు బాగా ఉపయోగిస్తారనే టాక్ ఉంది. ఈ నేపధ్యంలో, మృణాల్, పూజా మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నాయి.
Read More: Balakrishna కల ఇన్నాళ్ళకి నెరవేరనుంది!