HomeTelugu Trendingపూజా హెగ్డే మనసంతా అటే ఉంది..!

పూజా హెగ్డే మనసంతా అటే ఉంది..!

1 23
టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం దర్శకులు పూజా డేట్స్‌ కోసం ఎదురుచూసే పరిస్థితి. అరవింత సమేత, మహర్షి సినిమాల్లో నటించిన పూజా తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగు సినిమాల్లో బిజీ అయినా పూజా మాత్రం బాలీవుడ్‌వైపు చూస్తోంది. గతంలోనూ టాలీవుడ్‌లో నిలదొక్కుకునే సమయంలోనే హిందీలో మొహంజదారో సినిమాలో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో తెలుగు సినిమాల కోసం చాలారోజులు ఎదురుచూసింది. ఎట్టకేలకు మళ్లీ పుంజుకుంది.

1a 6

మళ్లీ ఇప్పుడు హిందీలో ‘ముంబై సాగ’ సినిమాలో ఆఫర్ రావడంతో వెంటనే సైన్‌ చేసేసిందట. సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ముంబై సాగ. ఇందులో హీరోలుగా జాన్‌ అబ్రహాం, ఇమ్రాన్‌ హష్మి నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకున్నారట. హృతిక్‌రోషన్‌ సరసన ‘మొహెంజోదారో’ అక్షయ్‌కుమార్‌తో హౌస్‌ఫుల్‌-4 చిత్రాల్లో పూజా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఏమైనా బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ సంపాదించాలనేది పూజా ఎయిమ్‌ అన్నట్టుగా వచ్చిన అవకాశాన్ని వదలడం లేదు. టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌పైనే పూజా హెగ్డేకు ఎక్కువ మనసున్నట్టుంది. టాలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్ సంపాదించి.. బాలీవుడ్‌వైపు వెళ్లి దాన్ని పోగొట్టుకోవడం ఎందుకని కొందరు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu