HomeTelugu Big StoriesNTR31: ఎన్టీఆర్ సినిమాకి ముహూర్తం ఫిక్స్

NTR31: ఎన్టీఆర్ సినిమాకి ముహూర్తం ఫిక్స్

Pooja Ceremony date locked for NTR31
Pooja Ceremony date locked for NTR31

NTR31 Shooting Update:

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.

దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ కే జీ ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్, నీల్ క్రేజీ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా.. ఆగస్టు 9న అధికారికంగా లాంచ్ కాబోతోంది. హైదరాబాద్ లో దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరగబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

కే జీ ఎఫ్, సలార్ సినిమాలలో హీరో ఎలివేషన్స్ చూసి ఫిదా అయిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. తారక్ కి ఏ రేంజ్ ఎలివేషన్ ఉంటుందో అని.. ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాకి డ్రాగన్ అనే ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కనిపించనున్న హీరోయిన్, విలన్, నటీనటుల గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఈ మధ్యన ఎన్టీఆర్ హాయ్ నాన్న సేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. నీల్ తో చేయాల్సిన సినిమా పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ శౌర్యువ్ తో రెండు భాగాలుగా ఉండే ఒక యాక్షన్ డ్రామా తీస్తారని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu