జగన్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడా ?, కాసేపు పని తీరు బాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోను అంటాడు, మళ్లీ అంతలోనే ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోను అంటాడు. అసలు మన జగనన్నకు క్లారిటీ ఉందా ? ఇది వైసీపీ ఎమ్మెల్యేలలో ప్రస్తుతం రగులుతున్న ప్రశ్న. బెదిరించి రాజకీయాలు చేస్తే.. ఆ రాజకీయం ఎక్కువకాలం నడవదు. జగన్ రెడ్డి మొదటి నుంచి ఇంతే. బుజ్జిగిస్తూనే మోసం చేస్తాడు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఇది కూడా తెలుసుకోలేని అమాయకులా ?, నిజానికి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు అంటే.. వాళ్ళు ఎన్నో డక్కా ముక్కీలు తిని ఉంటారు. కాబట్టి, జగన్ రెడ్డి చెప్పే కబుర్లకు వాళ్ళెవ్వరూ పొంగిపోరు.
వాస్తవానికి మొన్నటివరకూ పని తీరు బాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వను అని, తన ప్రతీ వర్క్ షాప్ లో జగన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పాడు. దీంతో వైసీపీ నేతల్లో అపనమ్మకం వచ్చేసింది. పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి.. చివరకు టికెట్ విషయంలో కూడా గ్యారంటీ ఉండదా ? అంటూ వైసీపీ ఎమ్మెల్యేలలో తీవ్రమైన అసహనం వచ్చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలలో సగంమంది పార్టీ కోసం ఖర్చు పెట్టడం మానేశారు. అదేమీ అంటే.. మా గ్రాఫ్ బాలేదు, కాబట్టి మాకు టికెట్లు ఇవ్వను అంటునప్పుడు మేం ఎందుకు ఖర్చు పెట్టాలి ? అని ఎమ్మెల్యేలు డైరెక్ట్ గానే ప్రశ్నలు సంధిస్తున్నారు.
అందుకేనేమో, జగన్ రెడ్డిలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు టెన్షన్ కనిపించింది. తన పార్టీ నేతల్లో ఎంతో గందరగోళం ఉందని, ముఖ్యంగా తన పై అపనమ్మకం ఉందని జగన్ రెడ్డి గ్రహించాడు. భారీ మూల్యం చెల్లించుకునే లోపే..పరిస్థితులు చక్కదిద్దుకోవాలని జగన్ రెడ్డి ఆరాట పడ్డాడు. అందుకే, జగన్ నిర్వహించిన తాజా సమావేశంలో జగన్ రెడ్డి చాలా కబుర్లు చెప్పాడు. నేను ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోను, అలాగే ఏ ఒక్క కార్యకర్తను కూడా దూరం చేసుకోను అని ఓ పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఒకపక్క అరవై మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవంటూ ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది.
పైగా ఈ ప్రచారం కూడా ప్రజల్లో కాదు, ఎమ్యెల్యేలు, పార్టీ కీలక నేతల మధ్యే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ రెడ్డి మాటలకు చేష్టలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. నిజంగా వైసీపీ పార్టీలో ఇది విచిత్రమైన వాతావరణం అనే చెప్పాలి. అధినాయకుడిని ఎమ్మెల్యేలు కానీ, క్యాడర్ కానీ నమ్మే పరిస్థితిలో లేరు. అలా అని నమ్మకుండా ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. అందుకే, ఎవరికి వారు సైలెంట్ గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం కసరత్తులు చేయడం కాదు కదా, ఏం జరగబోతుంది అబ్బా!! అన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేల రియాక్షన్స్ ఉన్నాయి. జగన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో కొందరి ఎమ్మెల్యేలలో అయితే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. వాళ్ళ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటేనే.. జగన్ రెడ్డి పై కోపంతో రగిలిపోతున్నారు అని స్పష్టం అవుతుంది.