HomeTelugu Big Stories2024 లో Andhra Pradesh ను కుదిపేసిన రాజకీయ వివాదాలు ఇవే!

2024 లో Andhra Pradesh ను కుదిపేసిన రాజకీయ వివాదాలు ఇవే!

Political Controversies that shook Andhra Pradesh in 2024!
Political Controversies that shook Andhra Pradesh in 2024!

2024 Political Controversies in Andhra Pradesh:

2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు, వివాదాలు చోటుచేసుకున్నాయి.

Tirupathi Laddu Controversy:

ముఖ్యంగా తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు వాడినట్లు వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఈ అపచారం జరిగింది అని చంద్రబాబు నాయుడు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ వివాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) దర్యాప్తు చేపట్టింది.

Jagan Property Issues:

మరొక కీలక వివాదం జగన్ కుటుంబం మధ్య ఆస్తుల పంచాయతీ. జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. షర్మిల చంద్రబాబు కుట్రకు లోనయ్యారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

Adani Bribe Controversy:

అంతేకాకుండా, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరోసారి కుదిపేశాయి. 2021లో గౌతమ్ అదానీ రూ.1750 కోట్ల లంచం ఇచ్చి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (PPA) సాధించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై చంద్రబాబు జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఈ ఒప్పందం అదానీతో కాకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తోనిదని, అది రాష్ట్రానికి ప్రయోజనకరమని జగన్ వివరణ ఇచ్చారు.

ఈ వివాదాలన్నీ జగన్ ఇమేజ్ కి గండి కొట్టాయి. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు పాలన విఫలతలను, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. అదనపు విద్యుత్ చార్జీలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా జగన్ ప్రభుత్వం ప్రజల మద్దతును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu