HomeTelugu NewsBangalore Rave Party: హేమ ఆ పార్టీలో ఉందా.. లేదా?

Bangalore Rave Party: హేమ ఆ పార్టీలో ఉందా.. లేదా?

Bangalore Rave PartyBangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అనేకమంది రాజకీయ, సిసీ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. ఈ కేసులో ఆమె వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా నటి హేమ పోలీసుల అదుపులో ఉందంటూ కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని తెలుగు మీడియా కూడా ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్టు వార్తలు ప్రసారం చేసింది.

అయితే సడన్ ట్విస్ట్ ఇస్తూ తాను హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని తాను బెంగళూరు ఫామ్ హౌస్ లో లేనని, ఆ పార్టీకి తనకి సంబంధం లేదంటూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అయితే ఆమె వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికి అదే డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటో ఒకదాన్ని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాక హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసిందని పోలీసులు తేల్చారు.

ఈ మేరకు మరో ప్రకటన చేశారు. నటి హేమ ఇదే పార్టీలో పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. హేమ వీడియో రిలీజ్ చేసిన సమయంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ లో కనపడిన చెట్లు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉన్నవేనని చెబుతూ పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ చెట్లను మార్క్ చేసుకుని, ఆ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేయడం గమనార్హం.

ఈ రేవ్ పార్టీలో కొకైన్ తో పాటు మరిన్ని రకాల డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి రైడ్స్ చేశారు. ఈ పార్టీలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్‌, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో 30 మంది అమ్మాయిలు, 70 మంది యువకులు పాల్గొన్నారు.

వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో తరలివెళ్లినట్టు తెలుస్తోంది. ఈవెంట్ కోసం ఫౌమ్ హౌస్ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకూ చెల్లించినట్టు తెలుస్తోంది. వీరిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే పలువురుని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ వీడియోల్లో కనిపించే వ్యక్తుల పోలికలను బట్టి కొంత మంది జానీ మాస్టర్ అని, ఇంకొంత మంది హీరో శ్రీకాంత్ అని వార్తలు రాసేస్తున్నారు. ఇలా తన పేరు వార్తల్లోకి రావడంతో వెంటనే నటుడు శ్రీకాంత్ కూడా స్పందించారు. ఇంట్లోనే ఉన్నానంటూ, ఇంటి వీడియోను కూడా చూపించాడు. తాను హైద్రాబాద్‌లోనే ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ వీడియో రిలీజ్‌ చేశాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu