HomeTelugu Trendingబాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌పై కేసు నమోదు!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌పై కేసు నమోదు!

6 23
బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్ కొత్త చిక్కుల్లో పడింది. ఆమె సోదరి రంగోలి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరైనా కంగనా జోలికి వస్తే ఆమె సోదరి రంగోలి చీల్చి చెండాడుతుంది. కంగనా ఖాతాలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అయితే కంగనా సోదరి ఆ వివాదాలకు మరింత ఆజ్యం పోస్తూ వాటిని పెద్దవి చేసేది. నిత్యం ఎదో ఒక వివాదంతో సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది రంగోలి. ఆమధ్య తాజ్‌మహల్ విషయం, ఇటీవల ఫిలింఫేర్ అవార్డుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. రంగోలి చేసే ట్వీట్ల పై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఓ మతానికి చెందిన ప్రజలను టార్గెట్ చేసుకొని టెర్రరిస్టులు అంటూ కామెంట్ చేశారు.

మొరదాబాద్‌లో వైద్యులు పోలీసులపై ఓ వర్గం చేసిన దాడికి సంబంధించిన వీడియోను ఉద్దేశించి రంగోలి పరుషమైన పదాలతో కామెంట్ చేసింది. ఈ కామెంట్లను హీరోయిన్ కంగనా కూడా సమర్ధించింది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ ను కూడా అధికారులు తొలగించారు. తాజాగా కంగనా రనౌత్ ఆమె చెల్లెలు విద్వేష పూరితమైన వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాపిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ అలీ కాపిఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, సోదరి రంగోలి, ఆమె మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu