యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు.
జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనుంది.