మెగా బ్రదర్ నాగబాబు నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొందరు కూడా నాగబాబుని టార్గెట్ చేస్తున్నారు. తాను ఎందుకలా అనాల్సి వచ్చిందో నాగబాబు వివరణ ఇచ్చినప్పటికీ ఎవ్వరూ వినడం లేదు. ఇక ఇప్పుడు ఈయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ ఈయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో మే 20న కేసు నమోదు చేశారు. మహాత్మ గాంధీని నాగబాబు అవమానించాడని.. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహాత్మా గాంధీ శాంతికి నిదర్మనమని ఆయన తెలిపాడు. అలాంటి గాంధీని హత్య చేసిన గాడ్సేను నాగబాబు పొగిడారని.. ఆయన నిజమైన దేశభక్తుడు అని చెప్పి గాంధీని అవమానించాడని ఆయన పేర్కొన్నాడు. ట్విట్టర్‌లో నాథూరామ్‌ను పొగుడుతూ గాంధీని అవమానించడం దేశాన్ని కించపర్చడమేనని తెలిపాడు ఆయన. వెంటనే నాగబాబు ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయడమే కాకుండా ధర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని ఆయన కోరాడు . మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిక.
o