HomeTelugu Trending'అల.. వైకుంఠపురములో..'పై కేసు నమోదు

‘అల.. వైకుంఠపురములో..’పై కేసు నమోదు

1 8
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. నిబంధనలకు విరుద్ధంగా మ్యూజికల్‌ కాన్సర్ట్‌ను నిర్వహించారంటూ ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ నైట్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీ సాయంత్రం యూసఫ్‌గూడలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో సోమవారం సాయంత్రం ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. చాలా వేడుకగా సాగిన ఈ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని తెలియజేస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులు ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహకులపై కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై జూబ్లీహిల్స్ సీఐ పి.బలవంతయ్య మాట్లాడుతూ.. ”అల.. వైకుంఠపురములో..’ మ్యూజికల్ కాన్సర్ట్‌కు సంబంధించి ఈ నెల 2న హారిక, హాసిని క్రియేషన్ మేనేజర్ యఘ్నేశ్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. 5 నుంచి 6వేల మంది అభిమానులు ఈ వేడుకలకు హాజరవుతారని.. అందుకు సంబంధించి అనుమతి పాస్‌లు ఇస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. వేడుక సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. అయితే కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. వీటికి తోడు పాస్‌లు 15వేలకు పైగా ఇవ్వడంతో వేడుక ప్రాంగణంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పాటు రహదారులు అన్ని పూర్తిగా ట్రాఫిక్ జామ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘించారంటూ జూబ్లీహిల్స్ ఎస్సై నవీన్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రేయస్ మీడియా సంస్థతో పాటు, ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్‌పై, హారిక అండ్‌ హాసిని క్రియేషన్ మేనేజర్ యఘ్నేష్ పై కేసు నమోదైంది’ అని పేర్కొన్నారు. మరి దీనిపై అల వైకుంఠపురంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu