Swathi Deekshith: టాలీవుడ్ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటి విక్రయం వ్యవహారంలో స్వాతి దీక్షిత్, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఇరు వర్గాల మధ్య డబ్బు విషయంలో వివాదం చెలరేగడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌లోని ఓ ఎన్ఆర్ఐ ఇంట్లోకి చొరబడి అక్కడి వాచ్‌మన్ కుటుంబాన్ని బెదిరించారని, గేటును ధ్వంసం చేశారని ఆరోపిస్తూ వాచ్‌మన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వాచ్‌మన్ కుటుంబం ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై కేసు నమోదైంది. సుమారు రూ.30 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఇంటి వ్యవహారంలో ఎన్నారైతో స్వాతి దీక్షిత్ విభేదాలున్నట్లు తెలుస్తోంది.
ఆస్తి వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నఆస్తిని లాక్కోవడానికి కుట్ర పన్నారని ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.