Homeతెలుగు Newsకరోనా కల్లోలంలోనూ పోలవరం పరుగులు

కరోనా కల్లోలంలోనూ పోలవరం పరుగులు

కరోనా కల్లోలం సమయం లోను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. వలస కార్మికులు ఇంటిబాట పట్టినా ఉన్న కార్మికులతోనే పనుల వేగం రెట్టించిన పట్టుదలతో పెంచింది. కరోనా లాక్ డౌన్ ప్రారంభమై తొలిదశ ముగిసిన తరువాత ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న బీహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిషా ,జార్ఖండ్ కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో మెజారిటీ కార్మికులను ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ భద్రంగా స్వస్థలాలకు చేర్చింది. గతంలో తమ వారిపై బెంగతో ఇంటి బాట పట్టిన కార్మికులు తిరిగి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటున్నారు. దీంతో ప్రాజెక్ట్ పనులు ఇప్పటికన్నా మరింత వేగం కానున్నాయి. కరోనా వల్ల కార్మికులు భయంతో గ్రామాలకు వెళ్లిపోవడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ దాదాపు ఆగిపోయిన విషయం తెలిసిందే. అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశ్యంతో పోలవరం ప్రాజెక్ట్ లోని కీలకమైన పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముమ్మరం చేసింది.meil

ప్రపంచంలోనే వరద నీరు అధికంగా ప్రవహించే భారీ స్పిల్వే పనులు కరోనా సమస్యలు అధిగమించి కొనసాగుతున్నాయి. స్పిల్వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ ఛానల్ ,ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం 1,2,3 (గ్యాప్లు) ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు మొదలై కొనసాగుతున్నాయి. సుమారు రెండు వేల మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లటంతో నామమాత్ర కార్మికులు, సిబ్బందితో పనులు చేయించాల్సి వచ్చినా అవి ఆగిపోకుండా ముందుకు సాగించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేఘా ఇంజనీరింగ్ సమర్థంగా వ్యవహరించాయి. స్పిల్వే, స్పిల్ ఛానెల్, జల విద్యుత్ కేంద్రం, మట్టి, రాతి పనులు ఈ కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగాయి. నవంబర్-డిసెంబర్ నెలలో వరద నీటి సమస్య వల్ల పనులు మందకోడిగా జరిగాయి. నవంబర్లో 206, డిసెంబర్లో 5628 ఘనపు మీటర్లు పనులు జరిగాయి. జనవరి నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ నెలలో 20639 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32443, మార్చిలో 36129 ఘనపు మీటర్ల స్పిల్వే, స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కరోనా ప్రభావం ప్రాజెక్ట్ పనులపై పడకుండా అటు నిర్మాణ సంస్థ మేఘా , ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి.

కరోనా సమయంలో కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవటంతో పాటు నిర్మాణానికి అతి ప్రధానమైన స్టీల్, సిమెంట్ , ఇతర వస్తువుల లభ్యత తీవ్రంగా ఉండటం, రవాణా స్తంభించిపోవటం వంటి అనేక అవరోధాలు కూడా పోలవరం పనుల వేగాన్ని నియంత్రించలేకపోయాయి. ప్రభుత్వం, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఈ సమస్యలను అధిగమించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలు ఫలించి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొరోనా భయంతో ఇళ్లకు వెళ్లగా మిగిలిన కార్మికులను మేఘా సంస్థ కంటికి రెప్పలా కాపాడుకొంది. కార్మికులు కోసం జిల్లా వైద్య సిబ్బంది, మేఘా సంస్థ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాయి. వారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అందచేశారు. ఈ మెడికల్ క్యాంపులో నిత్యం అన్నిరకాల వైద్య పరీక్షలు చేయటం తో పాటు కష్ట కాలంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు.ప్రభుత్వం, మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు ఇప్పుడిప్పుడే తిరిగి వచ్చి పనుల్లో చేరుతున్నారు. ఆయా రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు చేసి ఆ తరువాతనే పనులోకి అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా 1800 మంది తిరిగి వచ్చారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. ఏదేమైనా తిరిగి వచ్చే కార్మికుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది మేఘా సంస్థ.

గత ప్రభుత్వం హాయంలో స్పిల్ ఛానల్ పనులు ఆశించినంతగా జరగలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనిని ప్రారంభించి వేగంగా కొనసాగిస్తోంది. ఏప్రిల్లో స్పిల్వే కాంక్రీట్ పని 18714 ఘ.మీ, స్పిల్ ఛానెల్ 9511 ఘ.మీ కలుపుకొని మొత్తం 28225 ఘ.మీ కాంక్రీట్ పనిని పూర్తిచేశారు. మే నెలలో అంతకన్నా దాదాపు రెట్టింపు పని జరిగింది. స్పిల్ వే 10909, స్పిల్ ఛానెల్ 42354 ఘ.మీ చొప్పున మొత్తం 53263 ఘనపు మీటర్ల పనిని చేశారు. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినప్పటి నుంచి అంతకు ముందు ఏ నెలలోనూ చేయనంతగా మే నెలలో కరోనాని సైతం ఎదుర్కొని పనులు జరిగాయి అంటే ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుంది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు (జూన్ 08, 2020 2,01,025 ఘనపు మీటర్ల స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు జరిగాయి. కరోనా తో కార్మికులు దాదాపుగా వెళ్లిపోయినప్పటికీ స్పిల్వేలో మే నెలలో రోజుకు 3000 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేశారు. ఇదే నెలలో ఈ ప్రాజెక్ట్లో కాంట్రాక్ట్ లేబర్, కింది స్థాయి సిబ్బంది, ఇంజనీర్లు కలుపుకొని 1681 మంది పనులు పర్యవేక్షించారు. స్పిల్ వేలో 232 మంది కాంట్రాక్ట్ లేబర్, 200 మంది మేఘా సంస్థ సిబ్బంది అనునిత్యం పనిచేయడం ద్వారా ఇది సాధ్యమైంది. అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 310 మంది కంపెనీ సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు పనులు చేశారు.meil 1

ఈ ప్రాజెక్ట్లో మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగించడం, మట్టికట్ట నిర్మాణం, జల విద్యుత్ కేంద్రం పనులు, ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం పనులు కీలకమైనవి. గత సర్కారు హయాంలో ఈ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రాజెక్ట్లో స్పిల్వే కాంక్రీట్, లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్ట్లో అన్ని పనులు సకాలంలో పూర్తయితేనే దాని ప్రయోజనం నెరవేరుతుంది. అప్పట్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ కాఫర్ డ్యాంను మాత్రమే నిర్మించి నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రాజెక్ట్ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఆ పనిని కూడా పూర్తిచేయలేకపోయారు.

వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్ వే కాంక్రీట్ పనులు కొనసాగించడంతో పాటు ప్రధానమైన ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం (3 గ్యాపులు) నిర్మించడానికి అవసరమైన మట్టి పటుత్వ పరీక్షలు (వైబ్రో కంప్యాక్షన్ పనులు) మేఘా ఇంజనీరింగ్ చేపట్టింది. అలాగే స్పిల్ ఛానెల్ పనులు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా మట్టి తవ్వకం ఊపందుకుంది. స్పిల్ ఛానెల్కు సంబంధించిన కాంక్రీట్ బ్లాక్ నిర్మాణం కూడా క్రియాశీల దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో ఈ పనులును మేఘా ఇంజనీరింగ్ ప్రారంభించగా ప్రతినెలా పని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇప్పటికీ (జూన్ 08, 2020) 2, 01,025 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేసింది. పవర్ హౌస్ నిర్మాణ పనులు గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిలిచిపోయాయి. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించాలి. ఇందుకోసం ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 వర్టికల్ కప్లాంగ్ టర్బైన్లను ఏర్పాటు చేయాలి. ఈ పనిని చంద్రబాబు ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్) పనులు ఊపందుకున్నాయి.ఈ ప్రాజెక్ట్లో కాఫర్ డ్యాం గ్యాప్-1, ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) మట్టి పటుత్వ పరీక్షలు, సాండ్ ఫిల్లింగ్, గ్యాప్-3 పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్యాప్-2లో 22 లక్షల ఘనపు మీటర్ల మట్టి పని, సాండ్ ఫిల్లింగ్ 10 లక్షల ఘనపు మీటర్ల మేర చేయాలి. స్పిల్ ఛానెల్లో దాదాపు 42 లక్షల ఘనపు మీటర్లు, బండరాళ్లు 17 లక్షల ఘనపు మీటర్లకు పైగా తవ్వాలి. ఈ పనులు ఇప్పటిదాక వరుసగా 8,96,416, సాండ్ ఫిల్లింగ్ 2,78,000, పవర్ హౌస్ 2,16,265, కొండ తవ్వకం (బ్లాస్టింగ్) 64,816 ఘనపు మీటర్ల మేరకు జరిగాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే కలిగిన ఈ ప్రాజెక్ట్ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ లక్ష్యం మేరకు పనులను ప్రణాళికబద్ధంగా సాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్లో 50 లక్షల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్వే నిర్మిస్తున్నారు. చైనాలోని త్రిగాడ్జేస్ జలాశయ స్పిల్వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్కులు. దానికన్నా పోలవరం ప్రాజెక్ట్ 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. 2019 నవంబర్లో మేఘా పనులను ప్రారంభించగా అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు, వెనకా చేరిన దాదాపు 4 టిఎంసీల నీటిని ఎత్తిపోయడానికే అధిక సమయం పట్టింది. ఈ ప్రాజెక్ట్ను 2018లో పూర్తిచేస్తామని అప్పట్లో చంద్రబాబు పదే పదే ప్రకటించినప్పటికీ నిర్మాణ పనులు నత్త నడకను తలపించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu