Homeతెలుగు Newsవచ్చే ఏప్రిల్ కు పోలవరం లో మెజారిటీ పనులు పూర్తి

వచ్చే ఏప్రిల్ కు పోలవరం లో మెజారిటీ పనులు పూర్తి

గోదావరి నది పై మేఘా మహాయజ్ఞం ఆరంభమైంది. అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. కుయుక్తులతో, రాజకీయ కక్షలతో వేసే, వేయించే కేసులు, భారీ వరదల వంటి అవాంతరాలు ఎదురుకాని పక్షంలో దేశంలోనే పెద్దదైన బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరం ను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రణాలికలు రూపొందించింది. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రూజెక్టు కు రూపకల్పన జరిగింది. పుష్కర కాలం క్రితం వై ఎస్ రాజశేఖరెడ్డి ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ప్రాజెక్ట్ నిర్మాణం నత్త నడక కన్నా నెమ్మదిగా జరిగాయి. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సి ఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో రివర్స్ టెండరింగ్కు వెళ్లారు. రివర్స్ టెండరింగ్ లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును ప్రభుత్వానికి రూ 628 కోట్లు ఆదా అయ్యేలా మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఆ వెంటనే పనుల వేగం పెరిగింది. ప్రభుత్వం , మేఘా సర్వశక్తులు సమీకరించి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో భారీ యంత్రాల రణగొణధ్వనులు, వేలాది కార్మికులు అకుంఠిత దీక్షతో రాష్ట్ర ప్రజల కలను నిజం చేసే దిశగా చేస్తున్న శ్రమ కనిపిస్తున్నాయి.

‘సిఎం జగన్ మోహన్ రెడ్డి, మేఘా పట్టుదల, కార్మికులు, సిబ్బంది వల్ల పనులు చకచకా నడుస్తున్నాయి. 3. 07 లక్షల ఘణపు మీటర్ల కాంక్రీట్ పనిని ఈ ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేయాలనీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న మేఘా అందుకు అవసమైన ఇంజనీరింగ్ సిబ్బంది, విభాగాల వారి నిపుణులు, అధునాతన యంత్రాలు, సుమారు ఐదు వేలకు పైగా కార్మికులను షిఫ్ట్ ల వారీగా పని చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని పరిశీలించటంతో పాటు జలవనరులశాఖ అధికారులు, సిబ్బంది, మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఉత్సాహ పరచటంతో పాటు మార్గ నిర్ధేశం చేసేందుకు సి ఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న గురువారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారు.

Megha Polavaram

వచ్చే ఏడాది ఖరీఫ్ కాలానికి పోలవరం ప్రాజెక్ట్ జలాశయం లో ప్రధానమైన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ పూర్తి చేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పేరు గాంచిన కాళేశ్వరం, పట్టిసీమ, హంద్రీనీవా వంటి అనేక పధకాలను చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం పనులు చేపట్టటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే నమ్మకం ప్రజలు, అధికారులు, ముఖ్యంగా పోలవరం ఆయకట్టు ప్రాంత రైతులకు వచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణం లో స్పిల్ వే లోనే 53 బ్లాక్ ల నిర్మాణం కీలకం. ఈ పనిని గడువులోగా పూర్తి చేసేందుకు మేఘా పనులు చేపట్టింది. అందుకు అవసరమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంది.

బాబు తప్పిదం పనుల ఆలస్యానికి కారణం

రివర్స్ టెండరింగ్ లో పనులు దక్కించుకున్న మేఘా వాటిని ప్రారంభించటానికి మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. తొలుత స్పిల్ వే నిర్మించిన అనంతరం కాపర్ డ్యామ్ వగైరా నిర్మిస్తే ముంపు సమస్య వచ్చేది కాదు. తానె ఇంజనీర్ అనుకోని చంద్రబాబు చేసిన సూచనలను అధికారులు ఎదురు చెప్పలేక అమలు చేయటంతో ఈ సమస్య వచ్చి పడింది. కాపర్ డ్యామ్ వల్ల పలు ప్రాంతాలు మునిగి పోయాయి . పోలవరం స్పిల్ వే లో నాలుగు టి ఎం సి ల నీరు నిల్వ ఉంది. రోడ్స్ అన్ని పాడై పోయాయి. నీటిని తోడి, రోడ్స్ సరి చేసేందుకు మూడు నెలల విలువైన సమయాన్ని మేఘా వెచ్చించాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సమస్య లేకపోతె ప్రాజెక్ట్ పనుల్లో సింహభాగం చివరి దశకు వచ్చేవి.

ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన భూమి పూజ చేసి అదే నెల 21న పనులకు శ్రీకారం చుట్టింది. పనులను ప్రారంభించినా వాటిని వేగవంతం చేయటానికి సుమారు రెండున్నర నెలల సమయం మేఘాకు పట్టింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల స్పిల్ ఛానల్, స్పిల్ వే లో నిల్వ ఉన్న నాలుగు టి ఎం సిల నీటిని బైటకు పంపింగ్ చేయటం , పాడైన అంతర్గత రహదారులను సుమారు నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వినియోగించి వాహనాలు, భారీ నిర్మాణ యంత్రాలు రాకపోకలకు అనుగుణంగా సరి చేయ టానికి ఎక్కువ సమయం పట్టింది. ప్రస్తుతం పోలవరం పనులు ఊపందుకున్నాయి. జలాశయంలో కీలకమైన స్పిల్‌వే లో 53 బ్లాకులను నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకు 55 మీటర్ల ఎత్తు ఉంటుంది . వీటిని పూర్తి చేసే పనులు ఊపందుకున్నాయి. ఒక బ్లాకులో ఒక మీటర్‌ ఎత్తు నిర్మించడానికి (కాంక్రీట్‌ వేయడానికి) నాలుగు రోజుల సమయం పడుతుంది. సరాసరిన ప్రతీరోజు 12 బ్లాకుల్లో ఎత్తు పెంచే పని చురుగ్గా జరుగుతోంది. ఈ మొత్తం స్పిల్‌వేలో రెండున్నర లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిచేయాలి. గత ఏడాది వరదల వల్ల ఎదురైనా అడ్డంకులను అధిగమించి జనవరి నెలాఖరు నాటికి 25 వేల క్యూబిక్‌ మీటర్ల పనిని ఎంఇఐఎల్‌ పూర్తిచేసింది. ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. మార్చిలో 50 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసి, మిగిలిన పనిని ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో పూర్తిచేయాలని మైల్ స్టోన్ గా పెట్టుకున్న మేఘా సంస్థ జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో ముందుకు సాగుతోంది. స్పిల్ వే ఎత్తు పెరిగేకొద్ది పనులు చేయడం క్లిష్టం అయినప్పటికీ ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవడం ద్వారా లక్ష్యం మేరకు ముందుకు సాగుతోంది మేఘా. ఈ పనులకు సమాంతరంగా స్పిల్‌వే బ్లాకు పియర్స్‌లో కాంక్రీట్‌ పనులు ఊపందుకున్నాయి. రోజుకు 15 వందల క్యూబిక్‌ మీటర్ల పనిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వేలోని పియర్స్‌, ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామ్ పునాది పనులు మేఘా మొదలుపెట్టింది. జలాశయంలో కీలకమైన మోడీ గ్యాపులలో 1,3కి సంబంధించిన డిజైన్లు ఆమోదం పొందే పని మేఘా చేపట్టింది.

పోలవరం జలాశయం ఒక్కటైనా దీనిని మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గ్యాప్‌1తో పాటు స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్‌-3ను 150 మీటర్ల పొడవుతో చిన్నపాటి

Recent Articles English

Gallery

Recent Articles Telugu