Homeతెలుగు Newsపోలవరం...మే 2021నాటికి 48 గేట్ల బిగింపు

పోలవరం…మే 2021నాటికి 48 గేట్ల బిగింపు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుజాడల్లో ముందుకెళుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. ఎన్నికల మెనిఫెస్టోనే భగవద్గీత భావించి ప్రభుత్వ యంత్రానికి దిశానిర్దేశం చేస్తున్నారు. జగనన్న మాటిచ్చాడంటే చేసి తీరుతాడనే నమ్మకం ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ముచేయకుండా ప్రజారంజాక పాలనను సాగిస్తున్నారు.polavaram

దివంగత నేత కలల ప్రాజెక్టు పోలవరం..

1941సంవత్సరంలో నాటి బ్రిటిష్ సర్కార్ గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలోని పొలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాలు సుభిక్షమవుతాయని భావించారు. అయితే ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సాహసించలేదు. 2004లో నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞంలో పోలవరం ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్న సమయంలో ఆయన అకాల మరణం తెలుగు ప్రజలను కుంగదీసింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పొలవరం పనులు అంతంత మాత్రంగానే సాగాయి. నత్తను తలపించేలా పనులు సాగాయి.

తండ్రి ఆశయాన్ని నెరవేరస్తున్న సీఎం జగన్

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక తండ్రి ఆశయాలను అనుగుణంగా పాలన చేపడుతున్నారు. ఇందులో భాగంగానే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసేందుకు పూనుకున్నాయి. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మేఘా(మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్)కు పనులు అప్పగించారు. జగన్ మొండిపట్టుదలకు మేఘా తోడవడంతో ప్రస్తుతం పోలవరం పనులు జెట్ స్పీడుతో పరుగులు పెడుతోంది. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో రోజుకు కేవలం సగటున 131.59 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మాత్రమే చేసింది. నేడు జగన్ సర్కార్-మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కలిసి రోజుకు సగటున 3వేల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.polavaram 1

జగన్ సంకల్పం.. మేఘా చేయూత..

జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టును 2021 లోగా పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్పిల్ వే, స్పిల్ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను సమన్వయంతో చేపట్టి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించారు. పోలవరం పనులను సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండడం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేఘా సంస్థ ప్రతీరోజు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేస్తోంది. ప్రస్తుతం స్పిల్ వేలో వెయ్యి క్యూబిక్ మీటర్లు, స్పిల్ చానెల్ లో రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ప్రతీరోజు చేస్తున్నారు. అంటే రోజుకు 3వేల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తున్నారు. ఈ పనులు మే 2021 నాటికి పూర్తవుతాయి. 2021డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 2022జూన్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించేలా ఏపీ ప్రభుత్వం, మేఘా నడుం బిగించింది.

లాక్డౌన్లోనూ ఆగని పనులు..

కరోనా లాక్ డౌన్ తో బీహార్, ఒడిషాకు చెందిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలిపోవడంతో పోలవరం నిర్మాణ పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వలస కార్మికులకు భరోసా కల్పించి ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మే 2021నాటికి 48గేట్ల బిగింపు

మే 2021 నాటికి 48 గేట్లను బిగించి స్పిల్ వేను పూర్తి చేయనున్నట్టు మేఘా సంస్థ తెలిపింది. ప్రస్తుతం వరదలు తగ్గగానే నవంబర్ లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లో ఖాళీని భర్తీ చేసి నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా వడివడిగా పనులు చేస్తుంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లను జూలై 2021 నాటికి పూర్తి చేసేలా పనులు సాగుతోన్నాయి. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మేఘా సంస్థ ప్రతినిధులు తెలిపారు.polavaram 2

గోదావరికి వరద వచ్చినా డోంట్ కేర్..

ఈ వానాకాలంలో గోదావరి నదికి వరద వచ్చినా మేఘా డోంట్ కేర్ అంటోంది. పనులు ఆపకుండా చకచక చేసుకుంటూ పోతుంది. గోదావరికి 5లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే స్పిల్ వే, స్పిల్ చానెల్ కు వరద జలాలు చేరుతాయి. జూలై ఆఖరుకు ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. స్పిల్ వే పియర్స్ 52మీటర్లకు పూర్తి చేసి వాటికి గడ్డర్లు బిగించి బ్రిడ్జి స్లాబ్ వేసే పనులు చేపట్టి నవంబర్ వరకు పూర్తి చేస్తామని మేఘా చెబుతోంది. నవంబర్లో డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి కాఫర్ డ్యామ్ లను పూర్తి చేస్తారు. అప్పటివరకు పనులు కొనసాగేలా మేఘా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గోదావరి నీళ్లకు ఏపీలో కళ్లెం వేయాలని సీఎం జగన్ శాసించడంతో మేఘా ఈమేరకు పనులను చకచక పూర్తి చేస్తోంది.

ప్రపంచంలోనే ‘పోలవరం’ నంబర్ వన్

ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ చైనా నిర్మించిన ‘త్రీగోర్జెస్’. ఇది గరిష్టంగా 35లక్షల క్యూసెక్కుల వరద జలాలను తట్టుకునేలా నిర్మించారు. కానీ మేఘా సంస్థ ఏకంగా చైనాను దాటేసి 50లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా తట్టుకొని సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేను నిర్మించనుంది. ఇంజనీరింగ్ లోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పోలవరాన్ని మేఘా నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను కట్టి ఔరా అనిపించింది. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 38.70లక్షల ఎకరాలకు ఏపీ మొత్తం నీరందుతుంది. ప్రపంచంలోనే గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా పోలవరాన్ని తీర్చిదిద్దుతూ మేఘా సరికొత్త రికార్డును సృష్టించబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu