HomeTelugu Newsకరోనాపై మోదీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏమన్నారంటే..!

కరోనాపై మోదీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏమన్నారంటే..!

13 4
దేశవ్యాప్తంగా మూడో విడత లాక్‌డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిపై అనుసరించాల్సిన వ్యూహంపై పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను మోదీకి వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దని ప్రధాని మోడీని కోరారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదన్నారు. కరోనాతో కలిసి బతకడం తప్పదని అభిప్రాయపడ్డారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని కోరారు. రాష్ట్రాల రుణ పరిమితిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు జులై, ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని అది కూడా హైదరాబాద్‌ నుంచే వస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

లాక్‌డౌన్ సడలింపులు, కంటైన్‌మెంట్ వ్యూహాలపై పునరాలోచన చేయాలని ఏపీ సీఎం జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల్లో భయాందోళన తొలగించినప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. 6 వారాల లాక్‌డౌన్ పరిస్థితులను సమీక్షించుకుంటే సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంస్థాగతంగా క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచన చేయాల్సి ఉందని అన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయల అభివృద్ధికి 16 వేల కోట్లు అవసరమన్నారు. కేంద్ర సహకారం అవసరమన్న జగన్.. వడ్డీలేని లేదా తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలివ్వాలని కోరారు. ప్రజారోగ్యం కోసం ఇచ్చే రుణాల్ని ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలన్నారు. 87 వేల ఎంఎస్ఎంఈల్లో ఉన్న పది లక్షల మందికి చేయూత ఇవ్వాలని కోరారు. 6 నెలల కాలానికి వడ్డీ మాఫీ చేయాలని అడిగారు. ఉద్యాన పంటలతో పాటు మరికొన్నింటికి కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు జగన్. రాష్ట్రాల మధ్య రవాణాకు అడ్డంకులు ఉండొద్దని అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమేణ సడలించాల్సి ఉంటుందని ప్రధాని సీఎంలకు చెప్పినట్టు తెలుస్తోంది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడడంలో యావత్‌ ప్రపంచం భారత్ ను ప్రశంసిస్తోందని, రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయని కొనియాడారు మోడీ. తమ వారికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి తమ ఇళ్లకు వెళ్లాలని ఉంటుందన్న మోడీ.. అందుకోసం నిర్ణయాలు సవరించుకోక తప్పదని చెప్పారు. కరోనా వైరస్ గ్రామాలకు విస్తరించకుండా చూడాల్సిన అతి పెద్ద సవాలు మన ముందు ఉందన్నారు మోడీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu