HomeTelugu Newsవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మోడీ

వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మోడీ

15 7
కరోనా కట్టడిలో భాగంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రత్యేక ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ టీమ్ కోవిడ్ 19పై పోరులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీలను ప్రధాని మోడీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు విరాళంగా ఇచ్చింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా 5 కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి PM-CARES నిధిని రూపొందించారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పౌరులకు విజ్ఞప్తి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu