HomeTelugu Trendingజయప్రకాష్ రెడ్డి మృతిపై ప్రధాని మోడీ సంతాపం..

జయప్రకాష్ రెడ్డి మృతిపై ప్రధాని మోడీ సంతాపం..

PM modi condoles on tollywటాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున గుండెపోటుతో తన నివాసంలోని బాత్‌రూమ్‌లోనే జయప్రకాష్ రెడ్డి కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu