HomeTelugu NewsPM Modi Biopic: ప్రధానిగా బాహుబలి నటుడు!

PM Modi Biopic: ప్రధానిగా బాహుబలి నటుడు!


PM Modi Biopic

PM Modi Biopic: ప్రధాని మోడీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ బయోపిక్‌కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నటీనటులు ఎవరు, షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ఇలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రధాని మోడీ పాత్రలో నటించే యాక్టర్‌ ఫైనల్‌ అయ్యారట.

మోడీగా బాహుబలి నటుడు సత్యరాజ్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. లుక్‌ పరంగా ఇద్దరు కాస్త దగ్గరగా ఉంటారు. దీంతో మోడీగా సత్యరాజ్‌ బాగా సెట్‌ అవుతారని భావిస్తున్నారు. ఈ మూవీకి టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారట. ‘విశ్వనేత’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తుంది. సీహెచ్‌ క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వందే మీడియా ప్రై. లి పతాకంపై కాశిరెడ్డి శరత్‌ రెడ్డి నిర్మించనున్నారు. ఇందులో సత్యరాజ్‌తోపాటు అభయ్‌ డియోల్‌, అనుపమ్‌ ఖేర్‌, నీనా గుప్తా, పల్లవి జోషి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తారని సమాచారం. కాళభైరవ దీనికి సంగీతం అందిస్తుండటం విశేషం.

గుజరాత్‌కి చెందిన ప్రధాని మోడీ మొదట చాయ్‌ అమ్ముకున్నారట. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. క్రింది స్థాయిరాజకీయాల నుంచి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత గుజరాత్‌ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయన అసలు పేరు నరేంద్ర దామోదర దాస్‌ మోడీ. ఆయన గుజరాత్‌ రాష్ట్రానికి 2001 నుంచి 2014 వరకు మూడు సార్లు సీఎం అయ్యాడు. ఆ రాష్ట్రాన్ని `గుజరాత్‌ మోడల్‌`గా తీర్చిదిద్దారు. అనంతరం దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగి తొలి ప్రయత్నంలోనే పీఎం అయ్యారు.

రెండు సార్లు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఇప్పుడు మూడోసారి ఆయన పీఎం అవుతారా అనేది మరో ఇరవై రోజుల్లో తేలనుంది. ప్రధాని మోడీ వచ్చాక భారత ఖ్యాతి పెరగడం, విదేశాల్లో భారత గౌరవం పెరగడం, ఇతర దేశాల ప్రధానులు, అధ్యక్షులు ప్రధాని మోడీకి ఇస్తున్న గౌరవం దృష్ట్యా ఈ మూవీకి `విశ్వనేత` అనే టైటిల్‌ని ఫైనల్‌ చేసినట్టు టాక్‌. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu