టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాసమూర్తి కూడా సినీ రంగంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. మూర్తి మృతిపై సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.