గాన కోకిల ఎస్. జానకి (81) ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందట. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.