లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆగస్ట్ 11న మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. రానా ‘నేనే రాజు నేనే మంత్రి’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’, నితిన్ ‘లై’ సినిమాలు అదే రోజున రాదమ్ ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూడు సినిమాలు ఒకేరోజు రావడం కంటే కనీసం ఒక సినిమా ఒకరోజు ముందు అనగా ఆగస్ట్ 10న వస్తే బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకుల భావన. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ‘జయ జానకి నాయక’ సినిమాను ఆగస్ట్ 10న విడుదల చేయాల్సిందిగా బయ్యర్లు బోయపాటిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కనీసం ఒకరోజు ముందుగా విడుదల చేస్తే కలెక్షన్స్ పరంగా అడ్వాంటేజ్ అవుతుందని బయ్యర్లు, బోయపాటిని, నిర్మాతను అడుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు సినిమాలు ఒకేరోజు విడుదలైతే దేనికి కేటాయించిన థియేటర్లలో ఆ సినిమా విడుదల చేయాలి. అలా కాకుండా ఒకరోజు ముందుగా వస్తే వీలైనన్ని థియేటర్లలో సినిమా విడుదల చేసి క్యాష్ చేసుకోవచ్చు. ఈ విషయమే బోయపాటికి చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.