మెగా పవర్ స్టార్ చరణ్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘మగధీర’ సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది. కాజల్ హీరోయిన్‌గా నటించింది. పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా సాగుతున్నాయని అంటున్నారు. ఇక మరోవైపు ఈ సీక్వెల్‌కు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నరామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని డైరెక్టర్ శంకర్‌తో ఒక మూవీ చేస్తారట. ఇంతలోపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తారని, ఆ రెండు సినిమాలు అయిపోగానే రాజమౌళి, రామ్ చరణ్ కలయికలో మగధీరకు సీక్వెల్‌గా మగధీర-2 రానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో.