HomeTelugu Newsపైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు!

పైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు!

ధనుష్‌ హీరోగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో ‘కొడి’ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సిి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ‘ధర్మయోగి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈచిత్రం గత శనివారం విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఒక పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ధనుష్‌, త్రిషల పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా రూపొందిందనే మౌత్‌టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో పైరసీదారుల దృష్టి ఈ చిత్రంపై పడింది. కొందరు పైరసీ దారులు ఆన్‌లైన్‌లో ‘ధర్మయోగి’ చిత్రాన్ని పోస్ట్‌ చేసినట్టు సమాచారం అందడంతో హైదరాబాద్‌లోని యాంటీ పైరసీ సెల్‌కి ఫిర్యాదు చేశారు నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌. వారు వెంటనే స్పందించి ఆన్‌లైన్‌లో వున్న ‘ధర్మయోగి’ చిత్రాన్ని తొలగించారు. అంతేకాకుండా అది ఏ ఐపి అడ్రస్‌ ద్వారా పోస్ట్‌ అయిందనే విషయంపై ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని నిర్మాత తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేస్తే ఐపి అడ్రస్‌ ఆధారంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధనుష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ దిశగా దూసుకెళ్తున్న ధర్మయోగి చిత్రాన్ని పైరసీ ద్వారా చూడొద్దని, దానివల్ల మంచి చిత్రాలు తీసే నిర్మాతలు భారీగా నష్టపోతారని, కాబట్టి థియేటర్లలోనే సినిమాలు చూసి ఎంజాయ్‌ చెయ్యాలని ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌కుమార్‌ ప్రేక్షకులను కోరారు. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu