క్యూరియాసిటీ పెంచుతున్న ‘పిచ్చిగానచ్చావ్ ‘పోస్టర్
హీరో నాని చేతులమీదుగా రిలీజ్ అయిన శ్రీవత్స క్రియేషన్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫిలిం పిచ్చిగానచ్చావ్ పోస్టర్ కు సర్వత్రా మంచి రెస్పాన్స్ వస్తోంది . నాని చెప్పినట్టుగానే కథ , ఆర్టిస్ట్ లు ఎక్కడా రివీల్ కాకుండా క్యాచీ టైటిల్ , ఇంట్రెస్టింగ్ కలర్స్ తో రూపొందిన పోస్టర్ చూడగానే అందర్నీ ఆకట్టుకొంటోంది . ఈ సందర్బంగా నిర్మాత కమల్ కుమార్ పెండెం మాట్లాడుతూ మారిన ప్రేక్షకుల టేస్ట్ కు యిది ఎక్జామ్పుల్ అని , కొత్తగా ఉంటే చాలు ఇమీడియట్ గా ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతున్నారని , దానికితోడు నాని రిలీజ్ చేయడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ కు యింకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని , పోస్టర్ లానే సినిమా కూడా అందరికీ నచ్చుతుందని చెప్పారు . డైరెక్టర్ వి . శశి భూషణ్ మాట్లాడుతూ పోస్టర్ ఎంత క్యూరియాసిటీను పెంచిందో , రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తన్న సినిమా కూడా డిఫరెంట్ బ్యాక్డ్రాప్ లో , ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో రన్ అవుతూ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు . సంజీవ్ , నందు, కారుణ్య మెయిన్ లీడ్ చేస్తున్న సినిమా ద్వారా కామెడీ ఆర్టిస్ ఉత్తేజ్ కూతురు ,’చిత్రం’ ,’ బద్రి ‘ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన చేతన మరో ఫిమేల్ లీడ్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నది . పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటున్న సినిమాకు కెమెరా వెంకట హనుమ , మ్యూజిక్ రామ్ నారాయణ్ , ఎడిటింగ్ సత్య , ప్రొడక్షన్ కంట్రోలర్ పుచ్ఛా రామకృష్ణ .