యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సైఫ్ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా గురించి మాట్లాడారు. రావణ పాత్ర చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. రావణుడు సీతను ఎందుకు అపహరించాడు. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనన్నాడు. అయితే రాముడితో ఎందుకు యుద్దం చేశాడనే కోణంలో సినిమా ఉండబోతుంది. రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సైఫ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వివాదస్పదంగా మారాయి. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని పోగుడూతూ చేసిన ఆయన వ్యాఖ్యలపై పలు హిందు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సైఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రోల్స్ చేయడంతో అతడు క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ పలువురు ఈ వ్యాఖ్యలను ఇప్పటికి ఖండిస్తుండటంతో ఈ వివాదం తరచూ తెరపై నిలుస్తోంది.
తాజాగా ఈ సినిమాపై ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ‘ఆదిపురుష్’ సినిమా దర్శకుడు ఓం రౌత్, సైఫ్‌పై యూపీకి చెందిన న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్‌పూర్ కోర్టులో పిల్ వేశాడు. రావణుడిపై సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వసాలను దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.