యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమా ఈనెల 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. అక్టోబర్ 4న యూఎస్ లో ప్రీమియర్ షో పడనున్నాయి. ఈ సమయంలో నోట్లపై హైకోర్ట్ లో ఓయూ జేఏసీ నేత కైలేష్ నేత అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. నోటా అన్నది భారత ఎన్నికల సంఘం పరిథిలో ఉండే అంశం అని. దీనిని వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలని.. భారత ఎన్నికల సంఘం నుంచి నోటా సినిమా యూనిట్ ఏమైనా అనుమతి తీసుకుందా లేదా.. అనే విషయంపై పిటిషన్ దాఖలు చేశారు.
సినిమాలు ప్రజలపై ప్రభావితం చేస్తుంటాయని.. ఈ సమయంలో ఇలాంటి సినిమాలు రావడం వలన జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక సామాన్య పౌరునిగా కైలేష్ నేత అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్ట్ ఈ గురువారం విచారణ జరపనున్నది. అలాగే ఇందులో ఏవైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటె వెంటనే తొలగించాలని కూడా కైలేష్ నేత తన పిటిషన్లో పేర్కొన్నాడు.