Peoples Media Factory Upcoming Movies:
గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులు రొటీన్ కథలు ఉన్న సినిమాలను.. పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదు. కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్నా కూడా.. రొటీన్ కథలు ఉంటే సినిమాలు.. ఈమధ్య హిట్ కూడా అవడం లేదు. ప్రేక్షకులు ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేరే భాషలో అయినా పర్వాలేదు కానీ.. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన కంటెంట్ బేస్డ్ సినిమాలు.. తెలుగులో కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి.
తెలుగులో కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే కాక.. హై బడ్జెట్ ఎంటర్టైనర్లు కూడా తీసుకురావడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ముందే ఉంటున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కంటెంట్ ఉన్న సినిమాలను.. ఎంచుకోవడంలో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవాలి. అందులో కూడా విభిన్న జోనర్లకి సంబంధించిన కథలను ఎంచుకుని మరీ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాని.. నిర్మిస్తున్నది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెయిడ్ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్ అయినప్పటికీ.. ఫ్రెష్ విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టీజర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కి సిద్ధం అవుతుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మరొక సినిమా.. రాజా సాబ్. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి.. ఇంతకుముందు వరకు చాలానే సందేహాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యనే విడుదలైన ఫ్యాన్ గ్లింప్స్ తర్వాత.. ప్రభాస్ లుక్ చూసి ఫాన్స్ ఫిదా అయిపోయారు. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
హారర్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఇంకా తేజ సజ్జ హీరోగా మిరాయి, అడవి శేష్ హీరోగా జీ 2 (గూడచారి పార్ట్ 2) వంటి ఆసక్తికరమైన సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. కంటెంట్ ఉన్న కథలను వెతికి పట్టుకుంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్టార్ కాస్టింగ్ తో కంటెంట్ ఉన్న కథలతో ముందుకు వస్తుpన్న ఘనత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఇవ్వచ్చు.