Homeపొలిటికల్ఏపీ ప్రజల్లారా.. ఈ ప్రశ్న మీ భవిష్యత్తు కోసం !

ఏపీ ప్రజల్లారా.. ఈ ప్రశ్న మీ భవిష్యత్తు కోసం !

People of AP.. this question is for your future

ఓటు వేసే ముందు… ‘నేను ఎందుకు జగన్ రెడ్డికి మళ్లీ ఓటు వేయాలి ?’, అని ఒక్కసారి ఆలోచన చెయ్యండి. జన బాహుళ్యంలో అత్యంత ఉపేక్షకు గురయ్యే ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. ఎవరికయినా ఓటు ఎందుకు వెయ్యాలి ? అనేది పోయి, దురదృష్టవశాత్తు “ఫలానా వ్యక్తికి ఓటెందుకు వెయ్యకూడదు?” అనేది వచ్చి పడింది. దీనికితోడు అతను మన కులపోడు కాడు, వీడు ఓటుకు మూడు వేలిస్తే, వాడు అయిదిచ్చాడు, నాకు నెలనెలా డబ్బులు వేస్తున్నాడు వంటి కారణాలే ఈ సారి ఎన్నికల్లో కూడా నిర్దేశాలు అయితే, ఇక ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ ఏడు కొండల వాడు కూడా కాపాడలేడు. కాబట్టి ఏపీ ప్రజల్లారా మిమ్మల్ని మీరే కాపాడుకోండి.

బుర్రకు కాస్త పని పెట్టి ఈ సారి ఓటు వేయండి. ఒకసారి మీరు చేసిన పొరపాటు కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికి ఇప్పుడు ఉన్న పల్లంగా టైమ్ మిషన్ దొరికినా.. ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ముందుకు తీసుకు రావడం అసాధ్యమే. అందుకే.. వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలి ?, ఎందుకు వేయాలి ?, వేస్తే తమకు కలిగే లాభం ఏమిటి ?, తమ పిల్లల భవిష్యత్తుకు ఒరిగే ప్రయోజనం ఏమిటి ? అన్నిటికీ మించి పాలన కరెక్ట్ గా ఉందా ?, రాష్ట్రం అభివృద్ధి అవుతుందా ? లేదా ? అని ఆలోచించి ఓటు వేయండి. ఏపీ ప్రజల్లారా.. పోయినసారి చేసిన తప్పు మళ్లీ చేస్తే.. ఈ సారి ఆంధ్ర రాష్ట్రం గుండె ముక్కలు అయిపోతుంది. మూడు ముక్కల ముఖ్యమంత్రిది పోయింది ఏముంది ?, ఓడిపోగానే లండన్ పారిపోతాడు. మరి మీరు ఎక్కడికి పోవాలి ?.

కాబట్టి, ఏపీ ప్రజల్లారా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఈ కింద అంశాలను ఒక్కసారి చెక్ చేసుకుని ఓటు వేయండి.

అసలు జగన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఎలాంటివి ? అతని పరిపాలన విధానం ఏమిటి ?

జగన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థపై ఉన్న అవగాహన ఎంత ?

జగన్ రెడ్డికి దేశ/రాష్ట్ర భద్రత గురించి అక్కర ఎంత ?

ప్రతి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి జగన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి ?

ప్రజల ఆరోగ్య, వైద్య విధానాల పై జగన్ రెడ్డికి ఉన్న ప్లానింగ్ ఏమిటి ?

విద్యా వ్యవస్థ గురించి జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలేమిటి?

ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా జగన్ రెడ్డి చేసిన ప్రోత్సాహకాల ఏమిటి?

ఉద్యోగావకాశాల పెంపుకు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏమిటి ?

పర్యావరణ పరిరక్షణ కోసం జగన్ రెడ్డి చేసిన మంచి పనులు ఏమిటి ?

మాతృభాషాభివృద్ధికి జగన్ రెడ్డి తీసుకున్న చర్యలేమిటి?

ఒకప్పుడు జగన్ రెడ్డి కుటుంబ ఆర్థిక స్థితి ఏమిటి ?, రాజకీయాల్లోకి వచ్చాక జగన్ రెడ్డి కుటుంబ ఆర్థిక స్థితిగతులేమిటి ?

అసలు జగన్ రెడ్డి పై ఉన్న కోర్టు కేసులు ఎన్ని ?, అసలు అవి ఎందుకు ఉన్నాయి ?

సీఎం అయ్యాక జగన్ రెడ్డి ప్రవర్తన ప్రజలతో ఎలా ఉంది ? మాటతీరు ఎలా మారింది ? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుని జగన్ రెడ్డికి ఓటు వేయాలో ? వద్దో నిర్ణయించుకోండి.

మన జీవితం, మన జీవనం, మన కుటుంబం, మన విధివిధానాలు.. ఇలా ఒకటేమిటి ? మన రాష్ట్రం వెనకపడి పోతే అన్నీ మారిపోతాయి. ఇప్పటికే జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో విషయాల్లో ఎన్నో ఇబ్బందులున్నాయి. కాబట్టి, గతంలో చేసిన తప్పు మళ్లీ చేయడం తెలివైన ప్రజల లక్షణం కాదు. కావున, ఏపీ ప్రజల్లారా..అంతఃకరణశుద్ధితో ఓటు వేయండి. అది మీకే కాదు, ఈ దేశానికీ కూడా మంచిది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu