సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కళావతి’లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు ఆకట్టుకున్నాడు మహేష్. కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్. అందులో సితార కూడా కన్పించడం సూపర్ స్టార్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాంగ్ లో ఎవరూ ఊహించని విధంగా సితార మెరవడం, ఆమె అద్భుతమైన స్టెప్పులు మహేష్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వహిస్తుండగా.. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ‘మే 12న’ ప్రేక్షకుల ముందుకు రానుంది.