HomeTelugu TrendingRRR డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ప్రకటన

RRR డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ప్రకటన

Pen studios announced RRR
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ఆ సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌(థియేటర్‌లో విడుదల తర్వాత) డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులను ‘పెన్‌ స్టూడియోస్‌’ దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది. సినిమా ప్రసారం కానున్న డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్‌ స్టూడియోస్‌ పంచుకుంది.

పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జీ 5 సంస్థ స్ట్రీమింగ్ చేస్తుందని పేర్కొంది. అలానే దీనిని హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేస్తుందట. అలానే వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్, పోర్చిగీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్‌ భాషలలోకీ ‘ట్రిపుల్ ఆర్’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ అనువదించి విడుదల చేస్తుందని స్పష్టం చేసింది. అలానే శాటిలైట్ విషయానికి వస్తే హిందీ వర్షన్ ను జీ సినిమాకు ఇచ్చిన ఈ సంస్థ, తెలుగు, తమిళ, కన్నడలో స్టార్ ఛానెల్స్ కు అప్పగించింది. మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ కు ఇచ్చింది. ఇక హిందీలో థియేట్రికల్ రైట్స్ ను పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ కు అందించినట్టు పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu