‘పెళ్లి సందD’ హీరో,హీరోయిన్‌లు రోషన్, శ్రీలీలాతో పాటు మూవీ టీం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రం బృందం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పెళ్లి సందD హీరోహీరోయిన్‌ను, చిత్ర బృందాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. రేపు సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో శ్రీవారి ఆశీర్వాదం కోసం వచ్చామని చెప్పాడు. శ్రీనివాసుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇక హీరోయిన్ శ్రీలీలా మాట్లాడుతూ.. సినిమా బృందం మొత్తం శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అని, కుటుంబంతో కలిసి అందరూ చూడవచ్చని దర్శకురాలు గౌరీ రోణంకి పేర్కొన్నారు.